కూష్మాండ దేవిగా సరస్వతీ మాత
Goddess Saraswati as Goddess Kushmanda
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి దేవాలయంలో దసరా సందర్భంగా జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలు ఆదివారం నాలుగోరోజుకు చేరాయి. అమ్మవారు నాలుగోరోజున కూష్మాండ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారు జామునే అమ్మవారికి పూజాధికాలు సమర్పించి గారెలు నైవేధ్యంగా సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీతో బాసర జనసంద్రంగా మారింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.