చెత్తతో నిరసన
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ మున్సిపాలిటీ ఆవరణలో బయటి చెత్తను వేసి బీజేపీ నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. రెండు వారాలుగా మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే వారికి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు రెండు మాసాలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. పాలకవర్గం నిర్లక్ష్యం చేయడం పట్ల ఆగ్రహంతో చెత్తను వేసి తమ నిరసన తెలిపామని బీజేపీ నాయకులు తెలిపారు.