రష్యా అణ్వాయుధ పరీక్షలు

ప్రపంచదేశాల్లో కలవరం

May 22, 2024 - 17:21
 0
రష్యా అణ్వాయుధ పరీక్షలు

మాస్కో: రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్​ దక్షిణ సైనిక ప్రాంతంలో అణ్వాయుధ పరీక్షలను నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని మీడియా బుధవారం వెల్లడించింది. ఈ పరీక్షలో బెలారస్​ కూడా పాల్గొంటుండడం విశేషం. రష్యా అమెరికా దాని మిత్రదేశాల ద్వారా పలు ఆంక్షలు ఎదురయ్యాయి. దీంతో పాశ్చాత్య దేశాల బెదిరింపులకు గట్టి సమాధానమే చెప్పాలని రష్యా భావిస్తోంది. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఇరువైపులా 50వేల మంది సైనికులు మరణించారు. రష్యా అణ్వాయుధ పరీక్షలను పాశ్చ్యాత్య దేశాలు కూడా ఓ కంటకనిపెడుతున్నాయి. అణ్వాయుధ పరీక్షలతో ఉక్రెయిన్​ లో మరోమారు ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టాలని ఉక్రెయిన్​ భావిస్తోంది.