నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో 6జీ సేవలకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. న్యూ ఢిల్లీలో భారత మండపంలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ –2024లో బుధవారం మంత్రి పాల్గొని ప్రసంగంచారు. 6జీ టెక్నాలజీతో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందన్నారు. అత్యంత వేగవంతమైన 5జీని భారత్ త్వరలోనే అధిగమించబోతుందని మంత్రి తెలిపారు. 6జీ సాంకేతికతను అందిపుచ్చుకున్న తొలి దేశంగా భారత్ ఎదగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని తెలిపారు.
6జీ సేవలు ప్రతీ ఒక్కరికి అందేలా నాణ్యమైన, సరసమైనదిగా ఉండాలని నిర్ణయించామన్నారు. 6జీ అలయన్స్ తో భారత్ 10 ఆతం పెటేంట్లను పొందుతుందని తెలిపారు. దీంతో టెలికాం రంగంలో సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. డిజిటల్ యుగం రూపాంతరానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలతో బీఎస్ ఎన్ ఎల్,ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్–ఐడియా వినియోగదారులే ముందుగా 6జీ సేవలను అందుకుంటారని మంత్రి జ్యోతిరాధిత్య సింధియా స్పష్టం చేశారు.