రాజస్థాన్ లో 50 డిగ్రీలు
ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలు
జైపూర్: రాజస్థాన్ లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతం బుధవారం ఉష్ణోగ్రతలకు ప్రజలు తాళలేక బయటికి వెళ్లలేక తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇండోపాక్ సరిహద్దులో ఓ జవాను ఎడారిలో పాపడాలను కాల్చుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు హీట్ వేవ్ హెచ్చరికలను కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. యూపీ, ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజుల పాటు వేడిగాలులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
కోయంబత్తూరులోని అజీయార్‌లో గత 24 గంటల్లో 5 అంగుళాల వర్షం కురిసింది. మే 23న బంగాళాఖాతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు తీరానికి దూరంగా ఉండాలని సూచించారు.