రూ. 68.08 కోట్లు దాటిన ఎయూఎం ఎఎంఎఫ్​ ఐ నివేదికలో వెల్లడి

Rs. AUM exceeding 68.08 crores revealed in AMFI report

Dec 10, 2024 - 16:44
 0
రూ. 68.08 కోట్లు దాటిన ఎయూఎం ఎఎంఎఫ్​ ఐ నివేదికలో వెల్లడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ (ఎయూఎం) నవంబర్​ లో రూ. 68.08 లక్షల కోట్లు దాటిందని అసోసియేషన్​ ఫర్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇన్​ ఇండియా(ఎఎంఎఫ్​ ఐ) తెలిపింది.  మంగళవారం ఎఎంఎఫ్​ ఐ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్​ లో రూ. 67.25 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. ఈక్విటి పథకాలు రూ. 30.35 లక్షల కోట్లను 44.5 శాతం వాటాగా ఉందని తెలిపింది. ఎస్​ ఐపీలు నవంబర్​ లో రూ. 25,320 కోట్లు, అక్టోబర్​ లో రూ. 25, 323 కోట్లుగా స్థిరంగా ఉన్నాయి. అదే సమయంలో ఎస్​ ఐపీ ఖాతాల సంఖ్య 10.12 కోట్ల నుంచి రికార్డు స్థాయిలో 10.22 కోట్లకు చేరుకుంది. ఈక్విటీ- లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల (ఇఎల్​ ఎస్​ఎస్​) ఇన్‌ఫ్లోలు అక్టోబరులో రూ. 362 కోట్ల నుంచి రూ. 618.5 కోట్లకు పెరిగాయి. మొత్తంమీద రుణం నవంబర్‌లో రూ. 12,915 కోట్ల నికర ఇన్‌ఫ్లోను చూసింది. ఇది అక్టోబర్‌లో వచ్చిన రూ.1.57 లక్షల కోట్ల నికర ఇన్‌ఫ్లోలో 10శాతం కంటే తక్కువ అని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది.