మానవ హక్కులకు సైబర్​ నేరాలతో ఆటంకాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ

Dec 10, 2024 - 17:21
 0
మానవ హక్కులకు సైబర్​ నేరాలతో ఆటంకాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మానవహక్కులకు సైబర్​ నేరాలు కొత్త ఆటంకాలను కల్పిస్తున్నాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని,  హక్కులు కాపాడుకునేందుకు సాంకేతికంగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మనవ హక్కుల సంఘం న్యూ ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు ఏసిన సమావేశంలో ముర్మూ పాల్గొని ప్రసంగించారు. సైబర్​ నేరాలు, బెదిరింపులు, నకిలీ సమాచారం వ్యాప్తి వంటివి నూతన సమస్యలను తెచ్చిపెడుతున్నాయన్నారు. ప్రపంచంలో సాంకేతికత సహాయంతో భారత్​ పేదరిక, ఆకలి నిర్మూలన, యువతకు సమాన అవకాశాలను అందించే విధానాలను అమలు చేయడం ద్వారా భారతదేశం ప్రపంచం ముందు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అట్టడుగు వర్గాల హక్కులను నిలబెట్టేందుకు విధానపరమైన మార్సులను సిఫార్సు చేయడంలో ఎన్​ హెచ్​ ఆర్​ సీ చురుకైన పాత్ర పోషిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్​ హెచ్​ ఆర్​ సీకి సంబంధించిన మూడు ప్రచురణలను రాష్ట్రపతి ముర్మూ విడుదల చేశారు.