మంత్రి పదవులు ఖరారు?
మోదీ అధ్యక్షతన మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కొత్త మంత్రి వర్గం కోసం సుదీర్ఘ కసరత్తు కొనసాగింది. శనివారం జరిగిన ఈ కసరత్తులో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రమే ప్రధాని పదవికి మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో అదే సమయంలో మంత్రులతో ప్రమాణం చేయించే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల పంపకం కొలిక్కి వచ్చినా ఎవరెవరికి ఏయే శాఖలు అప్పగించాలనే దానిపైనే ప్రధానంగా బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్డీయేకు మిత్రపక్షాలుగా 13 పార్టీలుండగా ప్రధానంగా టీడీపీ, జేడీయూ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, అప్నాదళ్, పాశ్వాన్ తదితరులు ఎన్డీయే విజయానికి ప్రముఖ పాత్ర వహించారు. అయితే ఈ సమావేశంలో ఏయే పార్టీకి ఏయ మంత్రి పదవులు దక్కనున్నాయనే విషయం శనివారం రాత్రి వరకు పూర్తిగా ఖరారైపోతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు బిహార్ సీఎం నితీశ్ కుమార్ మంత్రి పదవులపై సొంతపార్టీ నేతలతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.