జెనీవా: ప్రపంచంలోని వ్యక్తుల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాంప్రదాయ వైద్య విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే చర్యలను వేగిరం చేసింది. గురువారం న్యూయార్క్ లోని డబ్ల్యూహెచ్ వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ నిర్వహణకు భారత్ 85 మిలియన్ యూఎస్ డాలర్లను విరాళంగా ఇచ్చే ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ తరఫున ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చి, డబ్ల్యూహెచ్‌ఓ తరపున డాక్టర్ బ్రూస్ ఐల్వార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లైఫ్ డబ్ల్యూహెచ్‌ఓపై సంతకం చేశారు.
గుజరాత్ జామ్ నగర్ లో ఏర్పాటు చేయనున్న డబ్ల్యూహెచ్ వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ నిర్వహణ కోసం పదేళ్ల కాలానికి 85 మిలియన్లను విరాళంగా అందించనుంది.
భారత భాగస్వామ్యంపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రజియా పెండ్సే కృతజ్ఞతలు తెలిపారు. సాంప్రదాయ, సమగ్ర వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. అఏ సమయంలో ప్రమాదకర మందుల వినియోగాన్ని తగ్గించనున్నారు.
భారత్ చేసుకున్న ఈ ఒప్పందానికి మరో విశేష ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఔషధ వినియోగానికి ఏర్పాటు కానున్న ఒకే ఒక్క కేంద్రం ఇదే కానుండడం విశేషం.