రూ. 5.01 లక్షల కోట్లుగా బడ్జెట్​?

బడ్జెట్​ లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం అధికారులతో బడ్జెట్​ పై మంత్రి నిర్మలా సీతారామన్​ భేటీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించే అవకాశం

Jun 17, 2024 - 17:41
 0
రూ. 5.01 లక్షల కోట్లుగా బడ్జెట్​?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టనున్న 2024–25 బడ్జెట్​ లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ న్యూఢిల్లీలో పలువురు అధికారులతో చర్చించారు. పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల సహాయంతో కేంద్ర ప్రభుత్వం 108 కేంద్ర నిధులతో పథకాలను అమలు చేస్తోంది. వారి అంచనా బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.01 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో పరిశ్రమలు, రైతు సంఘాల మధ్య చర్చల తర్వాత, సమస్యలపై పూర్తి స్పష్టత,పరిష్కార మార్గాలను కనుగొంటారు. అటు పిమ్మట ఏ రంగానికి ఎంత కేటాయించాలనేదానిపై సవివరంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చిస్తారు. అయితే మంత్రులు, ఉన్నతాధికారులు, ఆర్థిక రంగ నిపుణులతో మరోమారు గురువారం లేదా శుక్రవారం మరోమారు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. జూలై నెలాఖరులోగా బడ్జెట్​ ను సమర్పించాల్సి ఉంది.

మోదీ మూడోసారి అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రిగా తొలిసారి మరోమారు బడ్జెట్​ ను నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టనున్నారు.