ఘనంగా బక్రీద్ వేడుకలు
Great Bakrid celebrations
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: ముస్లింలు అతి పవిత్రంగా భావించే బక్రీద్ పండగను రామకృష్ణా పూర్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయాన్నే ముస్లిం సోదరులు నూతన దుస్తులు ధరించి పాత పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. బక్రీద్ వేడుకలు ప్రజల మధ్య శాంతి సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంచుతుంది అన్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ ఎస్సై రాజశేఖర్ తో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.