అనుచిత వ్యాఖ్యలొద్దు

ఎంపీ కంగనాకు జేపీ నడ్డా ఆదేశం

Aug 29, 2024 - 13:25
 0
అనుచిత వ్యాఖ్యలొద్దు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతు ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా మండి ఎంపీ, నటి కంగనా రౌనత్​ ను ఆదేశించారు. గురువారం కంగనా జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అరగంటపాటు వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇటీవల కంగనా రౌనత్​ పలు వేదికల ద్వారా రైతు ఉద్యమం, పంజాబ్​ మరో బంగ్లాదేశ్​ లాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ పార్టీ వ్యాఖ్యలు కావని అధిష్టాన పెద్దలు ఖండించారు. ఇవే అంశాలపై కంగనాతో జేపీ నడ్డా భేటీ అయి పలు అంశాలను ఆమెతో చర్చించారు. మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడాలని పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యల జోలికి వెళ్లవద్దన్నారు. స్వంత అభిప్రాయాలైన ఆచితూచి మాట్లాడాలని జేపీ నడ్డా ఎంపీ కంగనాకు సూచించారు.