దేశీయ రంగ సంస్థలకు మోదీ ఊతం

2023–24 త్రైమాసికంలో హెచ్​ఏఎల్​ వృద్ధి రూ. 4,308 కోట్ల లాభం రక్షణ శాఖ ద్వారా భారీ ఆర్డర్​

Jun 17, 2024 - 18:10
 0
దేశీయ రంగ సంస్థలకు మోదీ ఊతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:  హెచ్​ఏఎల్​ (హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​) రూ. 4,308 కోట్ల లాభాలతో భారీ వృద్ధి సాధించింది. 2023–24కు సంబంధించి మేలలో సెబీకి అందించిన త్రైమాసిక ఫలితాలను సెబీ సోమవారం వెల్లడించింది. మోదీ దేశీయ సంస్థల బలోపేతంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. హెచ్​ఏఎల్​ కు ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున పెద్ద ఆర్డర్​ లభించింది. 156 హెలికాప్టర్ల ఆర్డర్​ ను దక్కించుకుంది. ప్రస్తుతం సెబీ వివరాల వెల్లడితో ఈ సంస్థ షేర్ల ధరల్లో మరింత పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సంస్థ షేర్లను దక్కించుకున్న వారికి సంస్థ 166 శాతం రాబడిని అందించింది. అంటే పెట్టుబడికి 1.5 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 

ప్రధాని మోదీ గతంలో దేశీయ సంస్థలైన ఎల్​ఐసీ, హెచ్​ఏఎల్​ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.