ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు
నా తెలంగాణ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులు జలమయంగా మారాయి. తెలంగాణ వ్యాప్తంగా మరో ఆరు రోజులపాటు అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలర్ట్ జారీతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కలెక్టర్ రేట్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులకు గురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08455-276155కు సమాచారం అందించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ లో సమాచార సేకరణ కోసం ప్రత్యేక బృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనట్లు ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతూ ప్రజలు ఏ సమయంలోనైనా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించవచ్చు. వర్షాలు అధికంగా కురిసే ప్రాంతాల్లో చూద్దాం ప్రతిపాదికన చర్యలు చేపట్టేలా జిల్లా అధికార యంత్రాంగం సిబ్బందిని అప్రమత్తం చేసింది.
జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు..
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సింగూరు 55.5 అధికంగా వర్షపాతం నమోదు కాగా నారాయణఖేడ్ 36.3, హత్నూరలో 21.8, పుల్కల్ 25.8, జిన్నారం 21.0, సంగారెడ్డి 13.03, కంది 15.0, కొండాపూర్ 6.3, పటాన్చెరు, రుద్రారం 14.5, అమీన్పూర్, సుల్తాన్పూర్ 12.0, కోహిర్ 13.3, ఝరాసంగం 23.0, గుమ్మడిదల 26.5, పుల్కల్ 25.8, a అందోల్ అన్నాసాగర్ 71.0, నిజాంపేట్ 49.0, జహీరాబాద్, అల్గోల్ 19.5 మిల మీటర్ల వర్షపాతం నమోదైంది.