కడెం 10 గేట్లు ఎత్తివేత
Kadem 10 gates lifting
నా తెలంగాణ, ఖానాపూర్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని వాగులు వంగులు నిండుకుండలుగా మారి పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఆదివారం 10 గేట్లు ఎత్తినీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 7.195 క్యూసెక్కుల,700 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో 7.603 టీఎంసీ లు ఉండగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది. ఇన్ ఫ్లో 61,001 క్యూసెక్కులుగా నమోదవుతోంది. నీటిని విడుదల చేయడంతో గోదావరి నది తీర ప్రాంతంలో పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకూడదని, నీటిపారుదల శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాజెక్టు చేరుతున్న వరద నీటి ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.