ప్యూజన్ స్కూల్ నిర్మాణాల తొలగింపు 

పటాన్ చెరులో హైడ్రా కూల్చివేతలు 

Sep 3, 2024 - 15:51
 0
ప్యూజన్ స్కూల్ నిర్మాణాల తొలగింపు 
నా తెలంగాణ, సంగారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా  అక్రమ కట్టడాలు, నిర్మాణాలను తొలగించే పనులు నిలిపివేసి వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరువులో హైడ్రా అధికారులు ఆక్రమణకు గురైన పలు ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చివేశారు. అమీన్ పూర్ మండలంలోని ఐలాపూర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే  నంబర్ 119 భూమి కోర్టు పరిధిలో ఉండగా కొందరు వెంచర్ చేసి ప్లాట్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం అమీన్ పూర్ లోని సర్వే నంబర్ 462లోని ప్రభుత్వ భూమిలో ప్యూజియన్ ఇంటర్నేషనల్ ప్రైవేటు స్కూల్ లో హైడ్రా సహకారంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని 15 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేటు, రూమ్స్, స్టేడియాన్ని జేసీబీలతో పోలీసు బందోబస్తు నడుమ తహశీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. ప్రభుత్వ భూములను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ రాధా హెచ్చరించారు.