ప్రభావం చూపనున్న 370 రద్దు, డీ లిమిటేషన్
ఓటర్ల ఆలోచనా రీతిలో మార్పు
మోదీ వైపే మెజార్టీ, మైనార్టీ వర్గాల మొగ్గు
తప్పుదోవ పట్టించేపనిలో కుహాన రాజకీయనాయకులు
వికసిత్ భారత్ కే ప్రాధాన్యమిస్తారంటున్న విశ్లేషకులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
జమ్మూకశ్మీర్ ఎన్నికలు దేశానికి దిక్సూచిగా మారనున్నాయి. తొలివిడత 24 స్థానాలకు సెప్టెంబర్ 18న ఎన్నికలు జరగనున్నాయి. 2014 తరువాత జరగనున్న ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. 8.8 మిలియన్ల ఓటర్లు, 11,838 పోలింగ్ స్టేషన్ ల ద్వారా ఇక్కడి అభ్యర్థులు, పార్టీల భవితవ్యం తేల్చనున్నారు.
డీలిమిటేషన్ తరువాత జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. డీలిమిటేషన్‌ను రద్దు చేయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నించినా కేంద్రాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టుకుంది. లోక్ సభ ఎన్నికలను డీలిమిటేషన్ తరువాత నిర్వహించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను కూడా అదే ప్రాతిపదికన నిర్వహిస్తోంది. మోదీ ప్రభుత్వం ఆమోదించిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో మొత్తం సీట్ల సంఖ్య 107 నుంచి 114కి పెరిగింది. 2022 డీలిమిటేషన్ కసరత్తుతో 90 అసెంబ్లీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో జమ్‌లో 43, కశ్మీర్‌కు 47 స్థానాలు కేటాయించారు. జమ్మూలోని సాంబా, రాజౌరి, కథువా జిల్లాల్లో కొత్త నియోజకవర్గాలను కలిపారు. కాశ్మీర్‌లోని కుప్వారా మరిన్ని పొందింది. ఎస్టీల కోసం తొలిసారిగా తొమ్మిది సీట్లు రిజర్వ్ చేశారు. డీ లిమిటేషన్ లోతను పాటించారు.
ఆర్టికల్ 370 ద్దుతో జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాద ఘటనలు 70 శాతం తగ్గాయి. 81 శాతం మరణాలు తగ్గాయి. భద్రతా దళాలు మరణాల్లో 48 శాతం తగ్గుదల నమోదైంది. రాళ్లదాడి ఘటనలకు 2018లో 1,328 ఉండగా, 2024లో ఆ సంఖ్య పూర్తిగా తగ్గింది. 2018లో 228 ఉగ్రదాదులు జరగ్గా, 2024లో 217గా నమోదయ్యాయి.
2023 లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల రెండు కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ ను సందర్శించారు. 2024లో ఆసంఖ్య ఇప్పటికే కోటికిపైగా చేరింది. దీంతో స్థానికంగా ఉన్న వ్యాపారం, వాణిజ్యాలకు ఊతం, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో 34వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశారు.
2019–20 మధ్య ఈ రూ. 297 కోట్ల పెట్టుబడులు రాగా 2022–23లో రూ. 2,153 కోట్లకు పెట్టుబడులు పెరిగాయి. దీనికి అదనంగా రూ. 6వేల కోట్లతో కేంద్రం పైప్ లైన్ పనులను చేపట్టారు. 2014–15లో లక్ష కోట్లుగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 2022–23లో రూ. 2,27,927 కోట్లకు పెరిగింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్తగా 170 ప్రాజెక్టులను పూర్తి చేసింది.
, రైతుల రంగం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా భారీ ఎత్తున కార్యక్రమాలకు ప్రధాని మోదీ నమూనా అత్యంత ప్రాధాన్యత లభించడంతో ఇక్కడి మైనార్టీ, మెజార్టీ ప్రజల్లో బీజేపీకి ఆదరణ బాగా పెరిగింది. కొందరు కుహానా రాజకీయవాదుల వాదనలను ప్రజలు గమనిస్తూ అభివృద్ధి, కుటుంబ, ఆర్థిక క్షేమానికి, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల ఆలోచనా రీతిలో మార్పును అందించినట్లయ్యింది.
ఇటీవల జమ్మూకశ్మీర్ లోక్ సభ ఎన్నికల్లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ,జేకే సీ, స్వతంత్ర అభ్యర్థి ఒకఎన్ని స్థానాలను గెలుచుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, జేకేఎన్ సీ 15, కాంగ్రెస్ 12 స్థానాలను గెలుచుకుంది. ఈసారి డీ లిమిటేషన్, ఆర్టికల్ 370 రద్దు,ప్రధాని మోదీ నిర్ణయాలు, వికసిత్ భారత్ సంకల్పం వంటి లక్ష్యాలతో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగి భారీ సంఖ్యలో ఓట్లను కొల్లగొట్టే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు.
ఏది ఏమైనా ఒకప్పుడు భారతీయ జెండా ఎగురవేయాలంటేనే భయపడే జమ్మూకశ్మీర్‌లో నేడు క్రమేణా అక్కడి ప్రజల తీరులో మార్పు తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం కృతకృత్యులయ్యిందన్నది జగమెరిగిన సత్యం.