ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన సంతోషి నగర్ కాలనీవాసులు
Residents of Santoshi Nagar Colony who met MLA Marri Rajasekhar Reddy
అల్వాల్: మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని బొల్లారం ఎయిర్ ఫోర్స్ రోడ్డు మా సంతోషి నగర్ (బుడగ జంగాల బస్తి) వాసులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు.తమ కాలనీలో ఓపెన్ నాలాలో చెత్త వ్యర్ధాలు పేరుకుపోవడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ వ్యాధులు రావడంతో చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏ సమస్యా ఉన్న తన దృష్టి కి తీసుకు రావాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ఓపెన్ నాలాలో చెత్త వ్యర్ధాలు తొలగించాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించడంతో కాలని వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, నవీన్ , రూపేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు...