తాగుడుకు బానిసై ఆత్మహత్య

Addicted to alcohol and committed suicide

May 27, 2024 - 21:33
 0
తాగుడుకు బానిసై ఆత్మహత్య

నా తెలంగాణ,రామకృష్ణాపూర్ :  మద్యానికి బానిసై ఓ వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మందమర్రి పట్టణంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి మూడవ జోన్ కు చెందిన మేకల రవి (47) అనే వ్యక్తి కూలి తాగుడుకు బానిసై తరచు కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు.అదే విధంగా ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్యను డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు.భార్య ఇవ్వక పోవడంతో రవి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు