తీవ్రమైన రోగానికి సంకేతం!

బెయిల్​ పొడిగించాలని సుప్రీంలో సీఎం పిటిషన్​

May 27, 2024 - 14:32
 0
తీవ్రమైన రోగానికి సంకేతం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏడుకిలోల బరువు తగ్గాను ఇది ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి కారణం అందుకే ఏడు రోజులపాటు తన బెయిల్​ ను పొడిగించాలని సీఎం కేజ్రీవాల్​ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్​ దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన సీఎం కేజ్రీవాల్​ కు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు జూన్​ 1వ తేదీ వరకు బెయిల్​ ఇచ్చిన సంగతి తెలిసిందే. అరెస్టు అయిన 50 రోజుల తరువాత 21 రోజులకు గాను బెయిల్​ లభించింది. పిటిషన్​ లో కేజ్రీవాల్ బరువు 7 కిలోలు తగ్గారని, కీటోన్  స్థాయి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇది ఏదైనా తీవ్రమైన రోగానికి సంకేతం అయి ఉండవచ్చునన్నారు.