ఫోన్​ ట్యాపింగ్ లో ముగ్గురు బీఆర్​ఎస్ ​నేతలు కీలకం

నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్న పోలీసులు

Mar 25, 2024 - 15:17
 0
ఫోన్​ ట్యాపింగ్ లో ముగ్గురు బీఆర్​ఎస్ ​నేతలు కీలకం

నా తెలంగాణ, హైదరాబాద్: ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం గులాబీ నేతల మెడకు చుట్టుకుంటోంది. ప్రవీణ్​రావు, భుజంగరావు, తిరపతన్నల అరెస్టు విచారణ సందర్భంగా రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ట్యాపింగ్ ​వ్యవహారం వెనుక బీఆర్​ఎస్​ పార్టీ కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వారి ఆదేశాల మేరకే పోలీసులు ట్యాపింగ్​కు తెరతీశారని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా మారిన బీఆర్ఎస్ నేతలకు నోటీలిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే ఆ నేతల పేర్లు బయటికి రాలేదు. నేతల వ్యవహారంపై గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. నిందితుల రిమాండ్​ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ నేతలతోపాటు మరో నాయకుడికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీసీ సెక్షన్​ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం కాస్తా గులాబీ బాస్​ల మెడకు చుట్టుకునేందుకు ఎంతో సమయం పట్టేలా లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.