రిజర్వేషన్ల చిచ్చు.. 140మందికిపైగా మృతి

బంగ్లాదేశ్​ లో ఉద్రిక్త పరిస్థితులు సురక్షితంగా వెనక్కు భారతీయ విద్యార్థులు

Jul 21, 2024 - 14:24
 0
రిజర్వేషన్ల చిచ్చు.. 140మందికిపైగా మృతి

ఢాకా: బంగ్లాదేశ్​ లో అల్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల నేపథ్యంలో ఆందోళనలు, నిరసనలు కొత్త ప్రాంతాలకు పాంతాలకు పాకుతున్నాయి. ఆదివారం వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన హింసలో 140కు పైగా మంది మరణించారు. 

జూలై 19న కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు విడుదల చేసిన బంగ్లాలో ఉన్న నాలుగు యూనివర్సిటీ ప్రాంతాల్లో, దేశ వ్యాప్తంగా అల్లర్లు ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. విద్యార్థులు పెద్ద యెత్తున విధుల్లోకి వస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల ఆస్తిపాస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో పెద్ద యెత్తున బంగ్లా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. 

వివాదానికి కారణం..

స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు 30 శాతం రిజర్వేషన్ల్​ లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్​ హసీనా ప్రభుత్వం వీటిని రద్దు చేయగా ఢాకా హైకోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రిజర్వేషన్లను పునరుద్ధరించాలని జూన్​ 5న ఆదేశించింది. ఈ నిర్ణయంపై విద్యార్థులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రిజర్వేషన్ల పునరుద్ధరణ వద్దంటూ రోడ్డెక్కారు. హింసకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్​ చేసింది. ఆగస్టు 7న విచారణ జరగనుంది. ఇంతలోనే అల్లర్లు ఉధృత రూపం దాల్చాయి.

సురక్షితంగా భారతీయులు వెనక్కు..

బంగ్లాదేశ్​ నాలుగు యూనివర్సిటీలో చదువుతున్న 988మందిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చింది. మరో నాలుగు వేలమంది అక్కడ ఉన్నారని, వారిని కూడా వెనక్కి తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నిస్తుంది.