రష్యా అణు పరీక్ష విఫలం

Russian nuclear test failed

Sep 22, 2024 - 18:56
 0
రష్యా అణు పరీక్ష విఫలం

మాస్కో: రష్యా అత్యంత శక్తివంతమైన అణు పరీక్ష విఫలమైంది. లాంచ్​ ప్యాడ్​ కూడా పూర్తిగా ధ్వంసమైంది. 21న రష్యా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆర్​ఎస్​–18 సర్మత్​ ను రష్యాలోని అణు పరీక్ష కేంద్రం అర్ఖంగెల్క్స్​ ప్రాంతంలోని ప్లెసెట్క్స్​ కాస్మోడ్రోమ్​ నుంచి పరీక్షించింది. ప్రయోగదశలోనే కిపణి పేలిపోయింది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఈపరీక్షలో రష్యా నాలుగోసారి విఫలమైనట్లయ్యింది. 
రెండువేల టన్నుల బరువున్న ఈ క్షిపణి ప్రపంచంలోని ఏ మూలలోనైనా సమర్థవంతంగా దాడి చేసే సామర్థ్యంతో రూపొందించింది. దీని పొడవు 35.5 మీటర్లుండగా, చుట్టుకొలత 3 మీటర్లుగా ఉంది. ఈ రాకెట్​ పై నుంచి ఒకేసారిగా 10 నుంచి 15 వార్​ హెడ్​ లను అమర్చి దాడులు చేయవచ్చు. దీనిపరిధి 18వేల కిలోమీటర్లు. ఈ క్షిపణి సెకనకు 7.1 కి.మీ. వేగం, గంటకు 25,560కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. ఈ ప్రయోగం మరోసారి విఫలమవడం పట్ల రష్యా ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది.