పొరుగుదేశాన్ని పక్కన పెట్టి అభివృద్ధి దిశలో భారత్
ఆర్థిక అవసరాలకు దిక్కులు చూస్తున్న పాక్
భారత్ తో జతకట్టడానికి మరో ప్రయత్నం
ఎస్ సీవోలో కుండబద్ధలు కొట్టిన జై శంకర్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ పాక్ పర్యటన తరువాత భారత్ – పాక్ బంధాలలు పునరుద్ధరించబడుతాయనుకోవడం పొరపాటే అవుతుంది. ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదం, వేర్పాటు వాదాన్ని పూర్తిగా వీడితేనే చర్చలకు సిద్ధమని భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జై శంకర్ పర్యటనతో అప్పుల ఊబిలో కూరుకున్న పాక్ కు ఒరిగేదేం లేదు. పైగా ఎస్ సీవోలో జై శంకర్ భారత్ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఆ నిర్ణయానికి పాక్ కట్టుబడి ఉంటుందా? అంటే ఉండదనే చెప్పాలి. గతంలో కూడా అనేక ఒప్పందాల్లో పాక్ లబ్ధి పొంది భారత్ తో దోస్తీ చేసి ఆనక ద్రోహానికే పాల్పడింది.
ఇందిరాగాంధీ హయాంలో సిమ్లా ఒప్పందం, వాజ్ పేయ్ హయాంలో ఇరుప్రాంతాల్లో రవాణా ఒప్పందం, మోదీ హయాంలో దోస్తీకి చేయందించినా ఫుల్వామా, ఉరి లాంటి భారీ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇక పాక్ తో చర్చల్లేవ్ అని స్పష్టం చేసింది. గతంతో ఇక గుణపాఠాలు నేర్చుకున్నామని ఉగ్రవాదం అంతమే తమ పంతమని స్పష్టం చేసింది. అదే విధానంపై ఆధారపడి పాక్ తో బంధాలుంటాయని స్పష్టం చేసింది.
సిమ్లా ఒప్పందం.. గుణపాఠం–1
1971లో జరిగిన భారత్ –పాక్ యుద్ధం అనంతరం బంగ్లాకు స్వాతంత్ర్యం ఏర్పడింది. పాక్ ఓటమిపాలైంది. వారికి చెందిన 45వేల మంది సైనికులు, ఐదు వేల చదరపు మైళ్ల భూభాగం భారత్ ఆధీనంలోకొచ్చింది. పాక్ రష్యాతో ఒత్తిడి తెప్పించి భారత్ తో చర్చలు చేపట్టింది. అనంతరం భారత్ వారి సైనికులను, భూభాగాన్ని తిరిగిచ్చేసింది. అయినా పాక్ తన ఉగ్రవాదులను భారత్ లో చొప్పించి భారత్ ను విభజించే ప్రయత్నాలను మానుకోలేదు. పగా జియా ఉల్ హక్ కశ్మీర్ ను విభజించేందుకు పంజాబ్,లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని భారత్ ను అస్థిరపరచాలని బహింగంగానే పలు వేదికలపై ప్రకటించాడు. 2.5 లక్షల మంది కశ్మీరీ పండితులను చిత్రహింసలకు గురి చేసి వారిని కశ్మీర్ నుంచి తరిమికొట్టారు. దోస్తీ పేరుతో ద్రోహానికి పాల్పడ్డారు.
లాహోర్ ఒప్పందం.. గుణపాఠం–2
1999లో అటల్ బిహారీ వాజ్ పేయ్ అమృత్ సర్ ను సందర్శించేందుకు వెళ్లి పాక్ వినతిపై అక్కడ పర్యటించారు. ప్రధాని నవాజ్ షరీఫ్ తో కలిశారు. అనంతరం దౌత్యపరమైన చర్చలు జరిగి ఢిల్లీ–లాహో బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ ఒప్పందంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. ఉగ్రవాదానికి ఊతం ఇవ్వొద్దని, భారత్ తో విబేధాలు వద్దని ఇరుదేశాల సమస్యల పరిష్కారానికి చర్చలే ప్రధానమని అప్పటి ప్రభుత్వం చర్చల సారాంశం. అయినా పాక్ ప్రభుత్వం వాజ్ పేయి ప్రభుత్వం లబ్ధి పొందాక కార్గిల్ యుద్ధానికి తెరలేపింది. ఢిల్లీ–లాహోర్ ఒప్పందాలను తుంగలో తొక్కింది. దోస్తీ పేరుతో రెండోసారి అతి పెద్ద ద్రోహానికి తెరతీసింది.
2015లో మోదీ..
2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పాక్ తో స్నేహ హస్తం అందించారు. కాబూల్ నుంచి తిరిగి వస్తూ అకస్మాత్తుగా పాక్ కు చేరుకొని నవాజ్ షరీఫ్ కుటుంబానికి శుభకాంక్షలు తెలిపారు. సత్సంబంధాలను పునరుద్ధరించందుకు మోదీ ప్రయత్నించారు. కానీ 2016లో పఠాన్ కోట్ పై దాడి, ఉరీ సెక్టార్ లో దాడి, ఫుల్వామాలో పాక్ దాడికి పాల్పడి మూడోసారి కూడా దోస్తీ పేరుతో ద్రోహానికే తెరలేపింది.
ఇక ఈ దేశాన్ని నమ్మే పరిస్థితి లేదని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బే సరి అని భావించింది. అన్ని రకాల ఆలోచించి పొరుగు దేశంతో మైత్రి బంధం కంటే ప్రపంచదేశాలతో మైత్రి బంధాలకు ప్రాధాన్యతనిస్తూ నేడు దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతోంది. మరోవైపు ఇక్కడ ఉదహరించినవి మూడే. కానీ చరిత్రను గమనిస్తే పాక్ అంటేనే ద్రోహం అనేలా ఉంటుంది. నేడు భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే పాక్ అడుక్కుతినే దేశంగా ముద్రపడింది.
ఏది ఏమైనా ఈసారి భారత్ నిర్ణయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం ఒకటైతే, రెండోది ఉగ్రవాదంపై ఉక్కుపాదం. అదే సమయంలో దేశ విచ్ఛిన్నకర శక్తుల పీచమణచడం వైపు మోదీ ప్రభుత్వం పయనిస్తుంది. ఈ ఆలోచన సాకారమైతే అఖండ భారత్ కు పునాది పడినట్లే.