బడ్జెట్​ పై అఖిలపక్ష భేటీ

పార్లమెంట్​ సజావుగా సాగితేనే సమస్యల పరిష్కారం సాధ్యం డిప్యూటీ స్పీకర్​ పదవికి కాంగ్రెస్​ పట్టు పార్లమెంట్​ లో ప్రతిపక్షాల తీరు సరి కాదన్న కేంద్రమంత్రులు

Jul 21, 2024 - 14:02
 0
బడ్జెట్​ పై అఖిలపక్ష భేటీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25 బడ్జెట్​ మంగళవారం విడుదల కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం న్యూఢిల్లీలోని పార్లమెంట్​ భవన్​ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, రాజ్​ నాథ్​ సింగ్​, కిరన్​ రిజుజు, చిరాగ్​ పాశ్వాన్​,  కాంగ్రెస్​ నాయకుడు జై రాం రమేశ్​, ఎస్పీ నాయకుడు రామ్​ గోపాల్​ యాదవ్​, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ, ఆప్​ ఎంపీ సంజయ్​ సిగ్​, ఎన్సీపీ ప్రఫుల్​ పటేల్​ సహా పలువురు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా యూపీలో జరగనున్న కన్వీనర్​ యాత్ర, నీట్​ – యూజీ పేపర్​ లీక్​, అగ్నివీర్​, జమ్మూకశ్మీర్​ లో ఉగ్రదాడులు, మణిపూర్​ హింస, రైలు ప్రమాదాలపై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలను లేవనెత్తాయి. కాగా కాంగ్రెస్​ పార్టీ తమకు డిప్యూటీ స్పీకర్​ పదవి కావాలని డిమాండ్​ చేసింది.

కేంద్రమంత్రులు మాట్లాడుతూ.. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు జరగనున్నాయన్నారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇస్తామన్నారు. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను సజావుగా సాగనీయాలని కోరారు. ప్రతీసారి జరుగుతున్న సమావేశాల్లో ప్రతిపక్షాలు వ్యవహారించే తీరు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయా అంశాలపై సమాధానం చెప్పేందుకు, చర్యలు తీసుకునేందుకు పూర్తి సంసిద్ధంగా ఉందని గుర్తురెగాలన్నారు. దేశంలోని సమస్యలపై పార్లమెంట్​ వేదికగా పరిష్కార దిశగా కేంద్రం వెళుతుందన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.