పాక్​ లో మిన్నంటిన ఆందోళనలు

నీరు, విద్యుత్​, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల లాఠీచార్జీ, భాష్పవాయు గోళాల ప్రయోగం ఇద్దరు మృతి, పోలీసు అధికారికి కొట్టి చంపిన ఆందోళనకారులు భారత్​ సహాయం చేయాలని విజ్ఞప్తి

May 12, 2024 - 13:48
 0
పాక్​ లో మిన్నంటిన ఆందోళనలు

నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: పాక్​ పీవోకే ముజఫరాబాద్​ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ధరల పెరుగుదల, విద్యుత్​, నీటి సంక్షోభంపై పీవోకే ప్రజలు గత రెండు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. మీర్పూర్​, ఆజాద్​ జమ్మూకశ్మీర్​ (ఏజెకే), పాఠశాలలు, కార్యాలయాలు, దుకాణసముదాయాలను మూసివేశారు. ఆదివారం కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. భారత్​ వెంటనే జోక్యం చేసుకోవాలని పాక్​ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పీవోకే మానవ హక్కుల కార్యకర్తలు,ప్రజలు డిమాండ్​ చేస్తుండడం విశేషం.

మరోవైపు రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో ఇద్దరు మృతిచెందారు. ఆగ్రహ జ్వాలలతో ఆందోళనకారులు ఒక పోలీసు అధికారిని కొట్టి చంపారు. పీవోకే లో ఉన్న అనేక ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటిని పాక్​ ప్రభుత్వం వీరికి అందించకుండా నేరుగా ఇస్లామాబాద్​, కరాచీలకు చేరుస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్​ ను కూడా వీరికి సరఫరా చేయకుండా నగరాలకు సరఫరా చేస్తుంది. మరోవైపు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ విషయంపై పాక్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలిచ్చినా, విజ్ఞప్తి చేసినా లాభం లేకపోవడంతో ఆందోళనలు చెలరేగాయి. 

మరోవైపు ఐఎంఎఫ్​ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ప్రకటించినా ఇటీవల జరిగిన సమావేశంలో తామందించిన ఆర్థిక సహాయం ఎలా తీరుస్తారని పలు ప్రశ్నలు సంధించింది. దీంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా పాక్​ అధికారుల పరిస్థితులు ఉండడంతో వారికి ఆర్థికంపై ఏ మాత్రం అవగాహన లేదని పాక్​ తాము చేసిన సహాయం తీర్చలేదనే నిర్ణయానికి వచ్చింది. ఆర్థిక సహాయంపై మళ్లీ పీఠముడి వేసింది. ఈ పరిణామం కూడా పాక్​ కు ఆశనిపాతంలా పరిణమించింది. 

పాక్​ ఆందోళనలపై పీవోకే నాయకుడు అమ్జద్​ మాట్లాడుతూ.. గిల్గిత్​–బాల్టిస్తాన్​ తో సహా ఆక్రమిత పీవోకేపై భారత్​ దృష్టి సారించాలన్నారు. ఈ ప్రాంతం స్వాతంత్రం కోసం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.