రామాలయ వెండి నాణెం విడుదల
50 గ్రాముల నాణెం రూ. 5,860లకే
అయోధ్య: కేంద్ర ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను విక్రయించేందుకు ఆదివారం విడుదల చేసింది. ఈ వెండి నాణెం 50 గ్రాముల బరువుంది. నాణెం ధర రూ.5,860లుగా నిర్ణయించారు. ఈ నాణేన్ని స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ ఫోటో కనిపిస్తుంది. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించగా.. ఈ నాణెం కొనుగోలు చేసిన వారు.. ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చు.. లేదా ఎవరికైనా గిప్ట్ గా ఇవ్వొచ్చని రామ మందిర ట్రస్ట్ చెప్పింది.