శరద్​ ఫోటో వాడొద్దు ప్రచారంపై దృష్టి పెట్టాలి

Do not use Sharad's photo and focus on the campaign

Nov 13, 2024 - 16:22
 0
శరద్​ ఫోటో వాడొద్దు ప్రచారంపై దృష్టి పెట్టాలి

అజిత్​ వర్గానికి సుప్రీం సూచన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎన్సీపీ (అజిత్​ పవార్​) తన కాళ్లమీద తాను నిలబడి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, శరద్ పవార్​ ఫోటోను ప్రచారంలో వాడొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అజిత్​ పవార్​ ఎన్నికల ప్రచారంలో శరద్​ పవార్​ ఫోటో, గుర్తును వినియోగించుకుంటూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది చట్టవిరుద్ధమని ఒక పార్టీలో నుంచి వెళ్లిన వారు ఆ పార్టీకి చెందిన వారి ఫోటోను ఉపయోగిస్తూ ప్రచారం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో ఎన్సీపీ (శరద్​ పవార్​) వర్గం పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​ పై బుధవారం సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 

సుప్రీంకోర్టులో ఇరువర్గాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం అనంతరం తీర్పును వెల్లడించింది. మహారాష్​ర్ట ఎన్నికల్లో 36 స్థానాల్లో అజిత్​, శరద్​ పవార్​ వర్గీయుల ప్రత్యక్ష పోటీ ఉంది. అయితే ఇప్పటికే పలు గ్రామీణ ప్రాంతాలలో ఎన్సీపీ చీలికలపై  ఓటర్లకు పూర్తి అవగాహన లేదు. ఇదే అంశంపై లబ్ధి పొందేందుకు పవార్​ కుటుంబంలోని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా ఇరువురూ ప్రచారంపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. పార్టీ, గుర్తు వివాదాల విషయాలను కోర్టుకు వదిలిపెట్టాలని, ఒకరి ఫోటోను మరొకరు వాడుతూ ప్రారం చేపట్టరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.