అమెరికాపై ఇరాన్​ ఆగ్రహాం

వివాదాలకు దూరం ఉండాలని హెచ్చరిక

Apr 14, 2024 - 14:51
 0
అమెరికాపై ఇరాన్​ ఆగ్రహాం

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్​ పై ప్రయోగించిన క్షిపణులను అమెరికా కూల్చివేయడంతో ఇరాన్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధ వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని హెచ్చరించింది. నౌకను స్వాధీనం చేసుకన్న అనంతరం ఇజ్రాయెల్​ పై ఒకేసారి డ్రోన్​ లు, క్షిపణుల ద్వారా దాడులకు దిగింది. మరోవైపు ఇజ్రాయెల్​ సైన్యంతోబాటు సామాన్య పౌరులు కూడా ఇరాన్​ తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే సైనికులంతా సరిహద్దుకు చేరుకున్నారని ఇజ్రాయెల్​ ప్రకటించింది. మరోవైపు ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ యుద్ధానికి రెఢీ అని ప్రకటించింది.
దీంతో ప్రపంచదేశాల్లో మరో యుద్ధ భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఈ యుద్ధం ద్వారా అమెరికా లాంటి పెద్ద ఆర్థిక దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లనుండడంతో అమెరికా ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరో యుద్ధం జరగనీయబోమని వైట్​ హౌస్​ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాలు శాంతిసామరస్యాలతో ముందుకు వెళితేనే ప్రపంచ శాంతి సాధ్యమని అభిప్రాయపడింది. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ద్వారా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 
మరో వైపు ఓడను స్వాధీనం చేసుకున్న ఇరాక్​ దౌత్యవేత్తలతో భారత్​ చర్చలు మొదలు పెట్టింది. ఈ నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో భారత్​ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వారిని విడిపించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది.