17మంది మత్స్యకారుల విడుదల

కేంద్రం చొరవతో శ్రీలంక నిర్ణయం

Oct 20, 2024 - 15:18
 0
17మంది మత్స్యకారుల విడుదల

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 17మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. వారంతా ఆదివారం తమిళనాడుకు బయలుదేరారు. సముద్రంలో వేటాడుతూ ఈ మత్స్యకారులంతా శ్రీలంక జలాల్లోకి చేరుకున్నారు. దీంతో ఆ దేశ సముద్ర భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అనంతరం తమిళనాడు ప్రభుత్వం, మత్స్యకారులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కేంద్రం శ్రీలంకతో సంప్రదింపులు జరిపింది. భారత హై కమిషన్​ చొరవతో శ్రీలంక నేవి 17మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.