నిరంతర అభ్యాసం దేశాభివృద్ధికి కారణం

కర్మయోగి సప్త: లో ప్రధాని నరేంద్ర మోదీ

Oct 20, 2024 - 16:47
 0
నిరంతర అభ్యాసం దేశాభివృద్ధికి కారణం

 నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశాభివృద్ధికి వినూత్న ఆలోచన, నిరంతర అభ్యాసం, నైపుణ్యతను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్​ అంతర్జాతీయ కేంద్రం ‘కర్మయోగి సప్త:’ నేషనల్​ లెర్నింగ్​ వీక్​ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారత్​ ఎక్కువ శ్రామిక శక్తి కలిగి ఉన్నదేశమన్నారు. శ్రామిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు కర్మయోగి  కార్యాచరణ ఎంతో ఉపకరిస్తుందన్నారు. 

ఏఐని సద్వినియోగం చేసుకొని సాంకేతికతను విజయవంతం వినియోగించుకోవాలన్నారు. డిజిటల్​ విప్లవం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరుకోవడం అభినందనీయమన్నారు. సాంకేతికతలో మరింత పురోగతి సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  మిషన్​ కర్మయోగిలో భాగమైన ఐ గాట్​ ఫ్లాట్​ ఫారమ్​ లో 4 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. 1400 కంటే ఎక్కువ కోర్సులలో 1.5 కోట్ల సర్టిఫికెట్లను జారీ చేశామని తెలిపారు. 2020 లో ప్రారంభించిన మిషన్ కర్మయోగి ప్రపంచ దృక్పథాన్ని అవలంబిస్తూ, భారతీయ విలువలతో పాతుకుపోయిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పౌర సేవను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.