తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

Another train wreck that was narrowly missed

Nov 16, 2024 - 17:07
 0
తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

అజ్నీ నాగ్​ పూర్​ చక్రంలో గేటు
ప్రమాదమా? కుట్ర కోణమా?
విచారణ చేపట్టిన రైల్వే శాఖ

ముంబాయి: మహారాష్ట్రలో మరో రైలు పట్టాలు తప్పించే కుట్ర జరిగింది. శనివారం ప్యాసింజర్​ రైలుకు పట్టాలపై భారీ ఇనుప వస్తువు తట్టుకొని డ్రైవర్​ అప్రమత్తం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది పూణె నుంచి నాగ్​ పూర్​ వెళుతున్న అజ్నీ-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై అడవి మధ్యలో ఆగింది. విచారణలో రైలు హెచ్1 కోచ్ చక్రంలో గేటు ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఈ గేటు ట్రాక్‌పై పడి ఉన్న గూడ్స్ రైలుకు చెందినది. ఈ సంఘటన మూర్తిజాపూర్ కంటే ముందు జితాపూర్‌లోని అకోలా బద్నేరా మధ్య జరిగింది. దీంతో రైల్వే అధికారులు సమీపంలోని రైల్వే స్టేషన్ మూర్తిజాపూర్ నుంచి గ్యాస్ కట్టర్‌ను పిలిపించి రైలు చక్రంలో ఇరుక్కున్న గేటును కత్తిరించి వేరు చేశారు. దీని తర్వాత రైలు మరింత ముందుకు సాగింది.

గేటు రైలు చక్రంలో ఇరుక్కుపోవడం వల్ల హెచ్1 (ఏసీ ఫస్ట్ క్లాస్) కోచ్‌లోని వాటర్ ట్యాంక్, ఏసీ ట్యాంక్, వాటర్ పైప్‌లైన్ లకు నష్టం వాటిల్లింది.  ఈ గేటు ట్రాక్‌పై పడిపోయిందా? ఉద్దేశపూర్వకంగా పెట్టారా? అన్న విషయంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.