సోరెన్​ కు లభించని ఊరట అరెస్టు, రిమాండ్​, బెయిల్​ పిటిషన్​ ల తిరస్కరణ

ఝార్ఖండ్​ మాజీ సీఎం హేమంత్​ సోరెన్​ కు హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఆయన అరెస్టు అక్రమమంటూ వేసుకున్న ​ పిటిషన్​ ను హైకోర్టు శుక్రవారం విచారించి తిరస్కరించింది.

May 3, 2024 - 15:00
 0
సోరెన్​ కు లభించని ఊరట అరెస్టు, రిమాండ్​, బెయిల్​ పిటిషన్​ ల తిరస్కరణ

రాంచీ: ఝార్ఖండ్​ మాజీ సీఎం హేమంత్​ సోరెన్​ కు హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఆయన అరెస్టు అక్రమమంటూ వేసుకున్న ​ పిటిషన్​ ను హైకోర్టు శుక్రవారం విచారించి తిరస్కరించింది. అరెస్టు, ఈడీ రిమాండ్​ ను సవాల్ చేస్తూ బెయిల్​ ఇవ్వాలని డిమాండ్​​ చేస్తూ రెండు వేర్వేరు పిటిషన్​ లను సోరెన్​ వేశారు. వీటిపై హైకోర్టు విచార చేపట్టింది. అనంతరం రిట్​ పిటిషన్​ ను తిరస్కరించింది. హేమంత్​ సోరెన్​ 6న తన మామ శ్రద్ధా ఆచారాలకు హాజరు కావాలని పిటిషన్​ లో పేర్కొన్నారు. ఇందుకు మాత్రం కోర్టు మినహాయింపు నిచ్చింది. పోలీసు కస్టడీలోనే వెళ్లి ఆ కార్యక్రమానికి హాజరై ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడవద్దని పేర్కొంది. అదే సమయంలో ఆయన వేసుకున్న రెండు పిటిషన్లను తిరస్కరించింది.