హత్రాస్ తొక్కిసలాట జ్యూడీషియల్ కమిషన్ లో బాబా వాంగ్మూలం
Baba's testimony in the Hathras stampede judicial commission
లక్నో: హత్రాస్ తొక్కిసలాట కేసులో జ్యూడీషియల్ కమిషన్ ముందు భోలే బాబా హాజరయ్యారు. గురువారం కమిషన్ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. గత జులైలో హత్రాస్‌లోని ఫుల్రాయ్ మొఘల్‌గర్హి గ్రామంలో నారాయణ్ సకర్ హరి భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్ సత్సంగం సందర్భంగా తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. బాబాను కట్టుదిట్టమైన భద్రత మధ్య లక్నో సచివాలయంలోని జ్యూడీషియల్ కమిషన్ ముందు హాజరు పరిచారు. అనంతరం బాబా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వం, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇందులో కుట్రకోణం దాగి ఉండవచ్చన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 1న 3200 పేజీల చార్జీషీట్ ను సిట్ దాఖలు చేసింది.