దేశ ప్రజలకు ఆషాఢ ఏకాదశి శుభాకాంక్షలు

Happy Ashadha Ekadashi to the people of the country

Jul 17, 2024 - 20:19
 0
దేశ ప్రజలకు ఆషాఢ ఏకాదశి శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆషాఢ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. విఠల్​ భగవానుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నారు. బుధవారం ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషం, శ్రేయస్సుతో కూడిన సమాజాన్ని సృష్టించేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. భక్తి, వినయం, కరుణ వంటి భావాలు మానవాళిలో మేల్కోల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరుపేదలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 

కేంద్రమంత్రి అమిత్​ షా..


భక్తి, ఆరాధనలకు అత్యంత ప్రతిష్ఠమైన రోజు ఆషాఢ ఏకాదశి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. దేశ ప్రజలకు ఆషాఢ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. సనాతన హిందూ ధర్మంలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ప్రజలంతా భక్తిభావంతో మెలగాలని అమిత్​ షా ఆకాంక్షించారు.

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి..


ఆషాఢ ఏకాదశిని పాండురంగ ఏకాదశి గా కూడా పిలుస్తారని దేశ, తెలంగాణ ప్రజలంతా భక్తి ప్రవత్తులతో ఈ పర్వదినాన్ని సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి ప్రజలకు శుభవాకాంక్షలు తెలిపారు.
దీక్షలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు ఆషాఢ ఏకాదశి అని మంత్రి తెలిపారు. బుధవారం ఆషాఢ ఏకాదశి సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.