రాయ్ బరేలీ నుంచి రాహుల్ నామినేషన్
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులతో కలిసి రాయ్‌బరేలీలోని ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయంలో నామినేషన్ వేసేందుకు వచ్చారు.
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపినట్లు పార్టీ తెలిపింది. గాంధీ కుటుంబం లేకపోవడంతో శర్మ ఈ రెండు ప్రతిష్టాత్మక నియోజకవర్గాలను చూసుకున్నారు.
అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ప్రియాంక గాంధీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జాబితా విడుదలయ్యాక అన్ని ఊహాగానాలకు తెరపడింది.