ముడా కుంభకోణం.. ఈడీ సోదాలు

Muda scandal.. ED searches

Oct 18, 2024 - 17:38
 0
ముడా కుంభకోణం.. ఈడీ సోదాలు

బెంగళూరు: ముడా (మైసూర్​ అర్బన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ) కేసులో మనీలాండరింగ్​ ఆరోపణలపై ఈడీ ముడా కార్యాలయంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో కేంద్ర పారామిలటరీ, సీఆర్పీఎఫ్​ లు ఈడీ అధికారులకు ఎస్కార్ట్​ కల్పించారు. ఆయా ప్రాంతాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లోకాయుక్త కూడా ఈ కుంభకోణంపై ఎఫ్​ ఐఆర్​ ను నమోదు చేసింది. 14 విలువైన స్థలాలను సీఎం సిద్ధరామయ్య తన భార్య, బావమరిది తదితరుల పేరిత ఇతరుల పేరిట కొనుగోలు చేశారు. ఇందులోనే అక్రమాలు జరిగినట్లు ఈడీ పేర్కొంటూ సోదాలకు ఉపక్రమిస్తోంది. కాగా ఈ సోదాలపై సీఎం సిద్ధరామయ్య సీరియస్​ అయ్యారు.