పెట్రోల్, డిజీల్ ధరల్లో తగ్గుదల?!
ఐసీఆర్ఏ గిరీష్ కుమార్ కదమ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉందని ఐసీఆర్ ఏ (ఇన్వెస్టిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ)సీనియర్ ఉపాధ్యక్షుడు గిరీష్ కుమార్ కదమ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డిజీల్ ధరల తగ్గింపుపై పలు వివరాలందించారు. మార్చి – సెప్టెంబర్ మధ్య చమురు మార్కెటింగ్ సంస్థల ఆదాయం లీటర్ పై రూ. 15, డిజీల్ పై 12 పెరిగిందన్నారు. ముడిచమురు ధరలు 12 శాతం మేర తగ్గాయన్నారు. దీని కారణంగానే మార్జిన్లలో పెరుగుదల చోటు చేసుకుందన్నారు.
ప్రస్తుతం భారత్ కు దిగుమతి అయ్యే ముడి చమురు సగటు ధర బ్యారెట్ కు 74 డాలర్లు తగ్గిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మంత్రిత్వ శాఖలతో జరిపిన చర్చల్లో పెట్రోల్, డిజీల్ ధరల తగ్గింపు అంశం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా వీటి ధరల్లో తగ్గుదల నమోదు కావచ్చని కదమ్ తెలిపారు.