రెండేళ్లపాటు స్థిరంగా భారత్ వృద్ధి
ఓఈసీడీ నివేదిక విడుదల
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మరో రెండేళ్లపాటు భారత్ వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. భారత్ తోపాటు, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి జీ–20 సభ్య దేశాల్లో ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుందని పేర్కొంది. భారత్–ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఈ రెండు దేశాలు కొనసాగుతాయని తెలిపింది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం జీడీపీ పెరుగుదల నమోదవుతుందని తెలిపింది.
అదే సమయంలో చైనా ప్రభుత్వ బాండ్ ల జారీ ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతం లభించినా అక్కడి రియల్ వంటి కొన్ని రంగాలు తిరోగమన దిశలో ఉన్నందున 4.9 శాతంగా జీడీపీ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.