యుద్ధ విమానాలను అమ్మేసిన పాక్​!

Pak sold warplanes!

Sep 27, 2024 - 18:04
 0
యుద్ధ విమానాలను అమ్మేసిన పాక్​!

పీకల్లోతుల్లో ఆర్థిక కష్టాలు
ఉగ్ర చర్యల నిరోధానికి ససేమిరా
ఆర్థిక సహాయం అందించని ప్రపంచదేశాలు

ఇస్లామాబాద్​: గొప్పలకు బీరాలు పోతూ, ఉగ్రవాదాన్ని తన ఇంట్లో పెంచి పోషిస్తున్న పాక్​ ను రోజురోజుకు ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్​ ఆ ఊబి నుంచి బయటికి వచ్చేందుకు యుద్ధ విమానాలను విక్రయిస్తోంది. జేఎఫ్​ 17 సీ రకం మూడు యుద్ధ విమానాలను అజర్​ బైజాన్​ కు విక్రయించాలని నిర్ణయించింది. గురువారమే పాక్​–అజార్​ బైజాన్​ ల మధ్య ఈ డీల్​ జరిగినా శుక్రవారం బయటికి పొక్కింది.

ఆ దేశాధ్యక్షుడు అలియేవ్​ ఈ యుద్ధ విమానంలో కూర్చొని ఫోటోలకు ఫోజులు కూడా ఇవ్వడం గమనార్హం. అంతేగాక ఇరాక్​ కూడా పాక్​ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే మయన్మార్​, నైజీరియాలు ఈ రకమైన యుద్ధ విమానాలను కొనుగోలు చేశాయి. అజర్​ బైజాన్​ మూడోదేశంగా నిలిచింది. ఇక ఇరాక్​ పాక్​ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తే నాలుగో దేశంగా నిలవనుంది. మొత్తానికి రోజురోజుకు పాక్​ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నా ఉగ్రవాదానికి మాత్రం వెన్నుదన్నుగా నిలవడం మానుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆ దేశానికి ఆర్థిక సహాయం చేసేందుకు అన్ని దారులను మూసివేసింది.