దడ పుట్టిస్తున్న రెబెల్​అభ్యర్థులు

1951 నుంచి స్వతంత్ర అభ్యర్థుల ముఖ చిత్రం

Mar 27, 2024 - 18:29
 0
దడ పుట్టిస్తున్న రెబెల్​అభ్యర్థులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్: లోక్​సభ ఎన్నికల్లో ఆది నుంచి స్వంతంత్రులుగా పోటీ చేస్తున్న రెబెల్ అభ్యర్థులు ఆయా పార్టీలకు దడ పుట్టిస్తున్నారనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెబెల్​ అభ్యర్థులుగా రంగంలోకి దిగి చాలామంది హేమాహేమీలను పోటీలో ఓడించి స్థానికంగా తమ పట్టు నిరూపించుకున్నారు. పార్టీల్లో టికెట్లు లభించక కొందరు రెబల్​ అభ్యర్థులుగా స్వతంత్రంగా పోటీ చేస్తే, మరికొందరేమో ఆసక్తి కొద్దీ పోటీకి దిగుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక రెబల్​ అభ్యర్థుల పోటీ ముఖ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం..

1951–52 మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 37 మంది తొలిసారిగా ఎంపీలుగా విజయం సాధించి లోక్‌సభకు ఎన్నిక కావడం విశేషం. 1957లో రెండో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 42 మంది స్వతంత్ర ఎంపీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య సగానికి పైగా తగ్గింది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలు లోక్​సభకు ఎన్నికయ్యారు.నాలుగో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య మళ్లీ పుంజుకుంది. 1967లో జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్ర ఎంపీలు ఎన్నికయ్యారు. 1971లో ఐదవ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచే స్వతంత్రుల విజయాల సంఖ్య తక్కువగా నమోదైంది. ఈ ఎన్నికల్లో 14 మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా విజయాలను మాత్రం సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో కేవలం తొమ్మిది మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ఏడో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. 1980లో తొమ్మిది మంది స్వతంత్రులు లోక్‌సభకు ఎంపికయ్యారు. ఇక తొమ్మిదో లోక్​సభ 1984లో స్వతంత్ర ఎంపీల సంఖ్య విజయాల్లో వృద్ధి సాధించింది. 13 మంది లోక్​సభకు ఎన్నికయ్యారు. 1989లో 12మంది మాత్రమే విజయం సాధించారు. 1991– 10వ లోక్‌సభకు ఒక స్వతంత్ర ఎంపీ మాత్రమే ఎన్నికవడం విశేషం. అత్యల్ప సంఖ్యలో స్వతంత్ర ఎంపీలు లోక్‌సభకు ఎన్నికైనది 1991లో మాత్రమే కావడం కూడా రికార్డే. 11వ లోక్‌సభలో, పార్లమెంటులో స్వతంత్ర ఎంపీల వాటా మరోసారి పెరిగింది. 1996లో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది మంది స్వతంత్రులు లోక్‌సభకు అయ్యారు. 12వ లోక్‌సభలో 1998లో స్వతంత్ర ఎంపీల సంఖ్య ఆరుకి తగ్గింది. 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. 14వ లోక్‌సభలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు 2004లో జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల సంఖ్య 9కి పెరిగింది. 16వ లోక్‌సభకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేవలం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక 2019 17వ లోక్​సభలో చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఎంపీ అభ్యర్థిలో 8,054 మంది పోటీలో ఉండగా, అందులో 3,461మంది స్వతంత్రులు ఇందులో 3449 మందికి డిపాజిట్లు గల్లంతు కావడం విశేషం ఇంతమందిలో గెలిచింది మాత్రం నలుగురే కావడం మరో విశేషం. 

ఏది ఏమైనా 17 విడతలుగా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆయా పార్టీలకు కీలకంగా మారడంతో బాటు ప్రజాబాణిని సమర్థంగా పార్లమెంట్​లో వినిపించిన వారిని తిరిగి గెలుపొందిన వారికి ఆయా పార్టీలు దరి చేర్చుకున్నాయి. దీంతో రానురానూ స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్న సంఖ్య ఎక్కువగాఉన్నప్పటికీ గెలుపుపొందుతున్న వారి సంఖ్య దిగజారడం గమనార్హం.