GKR: బస్తీ పర్యటనకు విశేష స్పందన
Union Minister Kishan Reddy's Basti visit is getting an unprecedented response from people
- అడుగడుగునా కిషన్ రెడ్డికి ప్రజల స్వాగతం
- సికింద్రాబాద్ పార్లమెంట్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి
- బస్తీ ప్రజలు, అపార్ట్ మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనాలు
- ఎంపీ ఎన్నికల్లో మద్దతుగా నిలబడతామని స్వచ్ఛందంగా ప్రకటనలు
నా తెలంగాణ, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేపట్టిన బస్తీ పర్యటనకు విశేష స్పందన వస్తున్నది. అడుగడుగునా ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. బస్తీ ప్రజలు, అపార్ట్ మెంట్ వాసులనే తేడా లేకుండా అందరితో ఆయన మమేకమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు గురువారం అంబర్ పేట్ అసెంబ్లీ, నల్లకుంట డివిజన్, చైతన్య నగర్, సంజీవయ్య నగర్, ఇందిరానగర్, వెజిటేబుల్ మార్కెట్, వెంకటేశ్వర నగర్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటన లో కిషన్ రెడ్డికి కాలనీల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కాలనీ పెద్దలను, పుర ప్రముఖులను, కార్యకర్తలను పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మాట్లాడారు.
దేశం కోసం మోదీని గెలిపించాలి
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన పర్యటనలో కాలనీవాసులతో గత పదేండ్లలో మోదీ ప్రభుత్వ పనితీరు, దేశ ప్రగతిని వివరిస్తున్నారు. ఈసారి దేశం కోసం ఓటు వేయాలని, అభివృద్ధి కోసం ఓటు వేయాలని, మన పిల్లల భవిష్యత్ కోసం మోదీకి ఓటు వేయాలని కోరుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేననే విషయాన్ని వివరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా వృథానే అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ బీజేపీ ఎంపీలను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఆయన మాటలకు ఆయా కాలనీల ప్రజలు, బస్తీవాసులు స్వచ్ఛందంగా బీజేపీకే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.