మణిపూర్ 11 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్ లోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న (సోమవారం) రీ–పోలింగ్ చేపడతామని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇంఫాల్: మణిపూర్ లోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న (సోమవారం) రీ–పోలింగ్ చేపడతామని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 11 పోలింగ్ స్టేషన్లలో ఈసీ ఆదేశాల మేరకు అత్యంత భారీ భద్రత ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఏప్రిల్ 19న నిర్వహించిన ఎన్నికల్లో ఇక్కడ రిగ్గింగ్, అల్లర్ల నేపథ్యంలో స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల ఫిర్యాదు మేరకు ఈసీ రీ పోలింగ్ కు నిర్ణయించింది.
ఖురాయ్ నియోజకవర్గంలోని మొయిరంగ్‌కంపు సజేబ్, తొంగమ్ లీకై, ఛెత్రిగావ్‌లో నాలుగు, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 26న మణిపూర్ లో రెండో దశ ఓటింగ్ జరగనుంది.