నూతన క్రిమినల్​ చట్టాల అమలుకు రెఢీ

దేశ వ్యాప్తంగా అధికారులకు శిక్షణ.. జూలై 1 నుంచి అమలు

Jun 26, 2024 - 19:50
 0
నూతన క్రిమినల్​ చట్టాల అమలుకు రెఢీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జూలై 1 నుంచి కొత్త క్రిమినల్​ చట్టాలు అమలు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని సన్నాహాలను పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్ లు, ఐపీఎస్​ లు,  జైలు, ఫోరెన్సిక్, జ్యుడీషియల్, ప్రాసిక్యూషన్ అధికారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసినట్లు బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ 2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 2023లను అమలు చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 5.65 లక్షల మందికి ఈ చట్టాలపై అవగాహన కల్పించారు. వీరంతా ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 లక్షల మంది అట్టడుగు వర్గాలకు కూడా చట్టాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. నూతన చట్టాలలో ముఖ్​యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలపై కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. 

ఇప్పటికే పోలీసు శాఖ, భద్రతా శాఖ, ఆయా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ తమ దర్యాప్తుల్లో నేరాలు రుజువైతే చేపట్టాల్సిన చర్యలపై సవరణలు కూడా చేపట్టినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ చట్టాల ప్రకారం నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్​ స్టేషన్​ లోనైనా కేసులు నమోదు చేయడం, దర్యాప్తు ప్రారంభించడం వంటివి చేయవచ్చు.