బీజేపీలోకి నటీ రూపాలీ గంగూలీ మరాఠీ సినీ దర్శకుడు అమయ్ జోషి
టీవీ షో నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. బుధవారం ఆమె ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో పార్టీలో చేరారు.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: టీవీ షో నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. బుధవారం ఆమె ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో పార్టీలో చేరారు. నటితో పాటు సినీ దర్శకుడు అమయ్ జోషి కూడా బీజేపీలో చేరారు. అమయ్ అనేక మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇరువురికి పార్టీ సభ్యత్వం అందించారు.
ఈ సందర్భంగా రూపాలీ గంగూలీ మాట్లాడుతూ.. తాను పార్టీ వికాసానికి తోడ్పడేందుకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు. బీజేపీ,ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషం అన్నారు. ఆయన దేశానికి చేసే సేవ వల్లే తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అమిత్ షా నాయకత్వంలో ముందుకు వెళతానని అన్నారు. తానేదైనా తప్పు చేస్తే పార్టీ నేతలను తనను క్షమించాలన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పాలని రూపాలీ గంగూలీ విజ్ఞప్తి చేశారు.
47 ఏళ్ల నటి రూపాలీ ప్రస్తుతం టీవీ షో 'అనుపమ'ను నటిస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ షోలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.