దేశ భవిష్యత్ లో యువత నిర్ణయాలు కీలకం
అవార్డు గ్రహీతలకు మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందనలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ భవిష్యత్ లో యువత నిర్ణయాలు కీలక పోత్ర పోషించనున్నాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయా అన్నారు. బుధవారం జాతీయ యువజన, సేవా పథకం అవార్డును అందుకున్న పలువురు యువకులతో భేటీ అయి వారిని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో యువతకు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. యువత పరివర్తన, వినూత్న ఆలోచన ద్వారానే పురోగతి సాధ్యమవుతుందన్నారు.
రానున్న భవిష్యత్తుకి మరింత మెరుగైన ఫ్లాట్ ఫారమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువత చేసే వినూత్న ఆలోచనలు, ఫ్లాట్ ఫామ్ లకు ప్రభుత్వ సహకారం అందజేస్తామని తెలిపారు. అవార్డు గ్రహీతలను మంత్రి మాండవీయ అభినందించారు.