కాలుజారిపడ్డ మమత స్వల్ప గాయాలు
Mamata fell and sustained minor injuries
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కాలుజారి పడ్డారు. ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. శనివారం దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కుతుండగా కాలు జారి పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను పైకి లేపారు. అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా మమతా ఓ సారి ఇంట్లో కాలుజారి పడగా గాయాలయ్యాయి. క్యాంపస్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె కిందపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు కుట్లు వేశారు.
కాగా పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం జరిగిన సీబీఐ, ఎన్ఎస్జీ, బాంబు స్క్వాడ్ సోదాలతో సీఎం మమత తీవ్రంగా మథన పడుతున్నట్లుగా టీఎంసీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ దాడులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసినా కోర్టు పిటిషన్ ను 29న విచారిస్తామని అత్యవసరంగా విచారించలేమని ఖరాఖండిక చెప్పింది. దీంతో టీఎంసీ సీఎం మమతకు మరిన్ని చుట్టుముట్టాయి. అసలే ఎన్నికల నేపథ్యంలో మమత ఇమేజ్ కాస్త పూర్తిగా డ్యామేజ్ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.