వేగంగా విమానయాన రంగం అభివృద్ధి

Rapid development of aviation sector

Sep 12, 2024 - 21:56
 0
వేగంగా విమానయాన రంగం అభివృద్ధి
రెండో ఆసియా పసిఫిక్​ సదస్సులో ప్రధాని మోదీ
సంస్కృతి, భారతీయుల అనుసంధానం
మహిళల పాత్ర కీలకం
త్వరలో ఏయిర్​ ట్యాక్సీల్లో ప్రయాణిస్తామన్న ప్రధాని
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా భారత్​ సత్తా చాటుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. న్యూ ఢిల్లీ భారత మండపంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండో ఆసియా పసిఫిక్​ మంత్రుల సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ రంగం ద్వారా భారత సంస్కృతి, శ్రేయస్సు, వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను అనుసంధానించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం ఈ రంగానికి మధ్య తరగతి నుంచి కూడా రాకపోకలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇది డిమాండ్​ ను పెంచుతోందన్నారు. ఈ నేపథ్యంలో విమానయాన రంగం అభివృద్ధి సాధిస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. కేవలం పదేళ్లలో ఈ రంగం భారీ వృద్దిని నమోదు చేస్తుందన్నారు. 
 
ఈ రంగంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తుండడం అభినందనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విమానాన్ని నడిపై వారిలో 15 శాతం మంది మహిళలే కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మహిళలు కీలక సేవల్లో విజయాన్ని నమోదు చేస్తున్నారని వివరించారు.