నా తెలంగాణ, సంగారెడ్డి : హైడ్రా పేరుతో ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ అమీన్ పూర్ మండలంలోని బీరంగూడలో గల జయలక్ష్మి నగర్ నివాసి ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నారు. అతని వద్దకు రాము (42) వచ్చి ఇది అక్రమ నిర్మాణమంటూ, కూల్చకుండా ఉండాలంటే తాను మేనేజ్ చేస్తానని తనకు అందరూ తెలుసని తనతో డీల్ కుదుర్చుకోకపోతే కూల్చివేత తప్పదని రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు.
దీంతో ఇంటి నిర్మాణదారుడు అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుడు రామును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ రూపేష్ తెలిపారు.