అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం

అదానీ, జార్జ్​ సోరోస్​ అంశాలపై ఉభయ సభలు వాయిదా రాజ్యసభ చైర్మన్​ పై అవిశ్వాసం తీర్మానం

Dec 10, 2024 - 13:39
Dec 10, 2024 - 18:06
 0
అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం కూడా ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య నిరసనలతో వేడెక్కాయి. బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ పై కాంగ్రెస్, కూటమి పక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అదే సమయంలో జార్జ్ సోరోస్ ద్వారా కాంగ్రెస్ ముడుపులు అందుకున్న విషయంపై చర్చకు అధికార పక్షం పట్టుబడింది. అటు లోక్ సభలోనూ అదానీ, జార్జ్ సోరోస్ చర్చకు పట్టుబడటంతో పలుమార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన అవే అంశాలపై గందరగోళం నెలకొనడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. 

లోక్ సభ సభ వాయిదా..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్, మిత్రపక్షాల నిరసన పద్ధతులు సరి కాదన్నారు. సభను సజావుగా నిర్వహించేలా సహకరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ప్రతిపక్ష నేతల తీరు కూడా పార్లమెంట్‌లో అభ్యంతరకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సభా గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేసిన ప్రతిపక్షాలు బెట్టు వీడక నినాదాలు చేస్తుండడంతో 12 గంటల వరకు లోక్ సభను వాయిదా వేశారు. అనంతరం మొదలైన సభలో మళ్లీ అదే సంబంధిత కాంగ్రెస్, మిత్రపక్షాలు చర్చకు పట్టుబడ్డాయి. ఇక చేసేది లేక స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. 

రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం..
మరోవైపు రాజ్యసభ ప్రారంభం అయ్యాక ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. చైర్మన్ పై అవిశ్వాసానికి 60 మంది ఎంపీల సంతకాల సేకరణ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సంతకాలు చేసిన వారిలో టీటీడీ, ఆప్, ఎస్పీ, కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం రాజ్యసభను చైర్మన్ జగదీప్ ధంఖర్ బుధవారానికి వాయిదా వేశారు.